తూనీగ పిల్ల.. సెగలు రేపేస్తోంది

రియా చక్రవర్తి.. ఈ పేరుతో ఒక హీరోయిన్ తెలుగులో ఒక సినిమా చేసిన సంగతి కూడా మన ప్రేక్షకులకు గుర్తుండకపోవచ్చు. ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా పరిచయమైన ‘తూనీగ తూనీగ’లో నటించిన అమ్మాయే ఈ రియా. జెనీలియా పోలికలతో కనిపించిన ఈ అమ్మాయి.. ఆ సినిమా ఫ్లాప్ కావడంతో మళ్లీ టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. హిందీలో ఆమె చేసిన సినిమాలు కూడా మంచి ఫలితాన్నివ్వలేదు.

ఐతే ఈ మధ్య హాట్ హాట్ ఫొటో షూట్లతో రెచ్చిపోతోంది రియా. ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కొంచెం పద్ధతిగానే కనిపించిన రియా.. ఫొటో షూట్లలో మాత్రం క్లీవేజ్ షోలతో మతిపోగొడుతోంది. ఇలా కనిపిస్తే తప్ప బాలీవుడ్లో నెట్టుకు రావడం కష్టం అనుకుందో ఏమో కానీ.. అందాల ప్రదర్శనలో తాను ఎవ్వరికీ తీసిపోనని చాటుతోంది. తాజాగా ఆమె చేసిన క్లీవేజ్ షో  ముందు ఇంతకుముందు చేసినవన్నీ దిగదుడుపే.తడి అందాలతో సెగలు రేపుతోందామె. మరి ఈ షో అయినా ఆమెకు అవకాశాలు తెచ్చిపెడుతుందేమో చూద్దాం.