ప్రభాస్ క్రేజీ ప్రాజెక్ట్ లో తమిళ హీరో.!

పాన్ ఇండియా స్టార్ అలియాస్ మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలను సైన్ చేస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ నెక్స్ట్ సినిమాగా రాబోయేది మాత్రం ‘రాధే శ్యామ్’. చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న కంప్లీట్ లవ్ స్టోరీ. కానీ ఇదొక లండన్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ సినిమాగా రానుండడం విశేషం.

ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సమయంలో ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించనున్నాడని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. అతనే తమిళ్ ఆల్రెడీ స్టార్డం ఉన్న హీరో అథర్వ.. ఇప్పటికే వరుణ్ తేజ్ గద్దల కొండ గణేష్ సినిమాలో కనిపించి మెప్పించిన అథర్వ మరోసారి ప్రభాస్ రాధే శ్యామ్ లోనూ కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించనున్నాడు. రాధే శ్యామ్ లో ప్రభాస్ బ్రదర్ గా అథర్వ కనిపిస్తాడని సమాచారం, అలాగే కథని మలుపు తిప్పే పాత్ర అవుతుందని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరు నుంచి ప్రారంభమయ్యే షూటింగ్ లో అథర్వ కూడా జాయిన్ కానున్నారు.

ఇటీవలే పూజ హెగ్డే కూడా ఇన్ని రోజుల హోమ్ క్వారంటైన్ ఫినిష్ చేసి రాధే శ్యామ్ షూటింగ్ కోసం హైదరాబాద్ చేరుకుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ ప్యాన్‌ ఇండియా మూవీ విడుదల కానున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ అండ్ గోపికృష్ణ మూవీస్ వారు కలిసి నిర్మిస్తున్నారు.