‘రాధేశ్యామ్‌’లో ప్రభాస్‌ కాస్ట్యూమ్స్‌ గురించి షాకింగ్ విషయం

తెలుగు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రాధేశ్యామ్. సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా విడుదలైన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఇక ఈ సినిమా లో ప్రభాస్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అద్బుతమైన కాస్ట్యూమ్స్ తో ప్రభాస్‌ అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకుంటుందనే నమ్మకంతో రాధేశ్యామ్‌ బడ్జెట్‌ విషయంలో ఎక్కడ రాజీ పడలేదు.

ముఖ్యంగా ప్రభాస్ కాస్ట్యూమ్స్‌ కోసం ఏకంగా రూ. 6 కోట్లు ఖర్చు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రభాస్‌ లుక్‌ కోసం దర్శకుడు రాధాకృష్ణ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నాడు. అందుకే ఇప్పటికే వచ్చిన లుక్‌ తో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నారు. హీరోయిన్‌ పూజా హెగ్డే తో పాటు ఇతర నటీనటులు కూడా అత్యంత విభిన్నమైన స్టైల్‌ లో ఈ సినిమాలో కనిపిస్తారని అంటున్నారు. 1980 నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.

Share