ప్రభాస్‌ తో చేయబోతున్నది ‘పిట్ట కథ’ కాదుః నాగ్‌ అశ్విన్‌

నెట్‌ ఫ్లిక్స్‌ లో తాజాగా పిట్ట కథలు స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌ నాలుగు ఎపిసోడ్ లుగా రూపొందింది. నాలుగు ఎపిసోడ్‌ లకు నలుగురు యంగ్ డైరెక్టర్స్ డైరెక్ట్‌ చేయడం జరిగింది. అందులో ఎక్స్ లైఫ్‌ అనే ఎపిసోడ్‌ ను మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ రూపొందించిన విషయం తెల్సిందే. ఆ ఎపిసోడ్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. సైన్స్ ఫిక్షన్‌ కథాంశంతో ఈ ఎపిసోడ్‌ రూపొందింది. దాంతో ప్రభాస్ మూవీ కూడా ఎక్స్‌ లైఫ్‌ కు పూర్తి స్థాయి సినిమా గా ఉంటుంది. రెంటి స్టోరీ లైన్‌ లు సేమ్‌ అంటూ ప్రచారం మొదలు అయ్యింది.

పిట్టకథల్లోని ఎక్స్‌ లైఫ్‌ స్టోరీకి ప్రభాస్‌ సినిమా స్టోరీకి సంబంధం ఉందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందిస్తున్నారు. దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ పిట్ట కథలకు ప్రభాస్ మూవీ కథకు అస్సలు సంబంధం ఉండదని తేల్చి చెప్పాడు. ఇప్పటికే కథ మరియు స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయ్యింది. సినిమా పై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ను జూన్‌ లేదా జులైలో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సలార్‌ మరియు ఆదిపురుష్‌ లతో పాటు రాధేశ్యామ్‌ సినిమాలో ప్రభాస్‌ బిజీగా ఉన్నాడు.