ఆది పురుష్ – లక్ష్మణుడి పాత్రలో ఆ బాలీవుడ్ హీరో ఫిక్స్!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఆదిపురుష్. ఆది కావ్యం రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు. అలాగే రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తాడని అధికారికంగా వెల్లడైన విషయం తెల్సిందే. ఇక సీతగా అతి ముఖ్యమైన పాత్రలో కృతి సనన్ నటిస్తుందని బలంగా ప్రచారం జరుగుతోంది.

రామాయణంలో మరో ముఖ్యమైన పాత్ర లక్ష్మణుడు. ఈ పాత్రలో ఎవరు నటిస్తారు అన్న చర్చ సోషల్ మీడియాలో బాగానే జరిగింది. రకరకాల పేర్లు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ప్రభాస్ తమ్ముడిగా లక్ష్మణుడి పాత్ర పోషించనున్నాడట.

ఇది అధికారికంగా త్వరలోనే వెల్లడిస్తారని సమాచారం. ఆది పురుష్ వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల కానుంది. టి సిరీస్ ఆది పురుష్ ను భారీ స్థాయిలో నిర్మిస్తోంది.