మంచు సినిమాలో పోలీస్ గా కంచె బ్యూటీ

తెలుగు ప్రేక్షకులకు కంచె సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎన్నో ఏళ్ళు అయినా కూడా సరైన సక్సెస్ దక్కలేదు. అయినా కూడా ఈ అమ్మడు వరుసగా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తు వస్తుంది. తాజాగా ఈమె మోహన్ బాబు సన్నాఫ్ ఇండియా సినిమాలో కీలక పాత్రలో నటించినట్లుగా సమాచారం అందుతోంది.
మోహన్ బాబు సుదీర్ఘ కాలం తర్వాత పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న సన్నాఫ్ ఇండియా సినిమా లో ఈ అమ్మడు నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో ఈ అమ్మడు కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను ప్రగ్యా అప్పుడే పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఈ అమ్మడికి మరో ఆఫర్ వచ్చింది. దీనితో అయినా ప్రగ్యా బిజీ అయ్యేనా అనేది చూడాలి.