ప్రగ్య డిమాండ్ కి చేతులెత్తేసిన నిర్మాతలు!

అఖండ`తో తొలి కమర్శియల్ సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది ముంబై బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్. తొలి సినిమా `కంచె`తో నటిగా ప్రూవ్ చేసుకున్నా ప్రగ్యా కెరీర్ వేగం పెరగలేదు. అటుపై రెండు సినిమాల్లో నటించినా.. అవి సక్సెస్ కాకపోవడంతో రేసులో వెనుకబడింది మళ్లీ కొంత గ్యాప్ అనంతరం `అఖండ`లో ఛాన్స్ దక్కించుకుని బ్లాక్ బస్టర్ అందుకుంది. ఇందులో ప్రగ్య పాత్ర..ఆహార్యం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగాను నిలిచాయి. బాలయ్య లాంటి సీనియర్ హీరోలకు పర్పెక్ట్ జోడీగాను మ్యాచ్ అవుతుందని క్లారిటీ వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ఇదే అదనుకగా పారితోషికం పెంచేసిందని టాక్ వినిపిస్తోంది.

ఇటీవలే ఇద్దరు నిర్మాతలు సీనియర్ హీరోల సరసన నటించాలని సంప్రదిస్తే పారితోసికంగా కోటి రూపాయలు డిమాండ్ చేసిందిట. దీంతో ఆ ఇద్దరు నిర్మాతలు షాక్ అయ్యారుట. ఇలా హిట్టు కొట్టగానే కోటి డిమాండ్ చేయడం చూసి మారు మాట్లాడకుండా వెనక్కి వచ్చేసినట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. అఖండ చిత్రానికి ప్రగ్యా అందుకున్న పారితోషికం అంతా కలుపుకుని 30 లక్షల లోపే ఉంటుందిట.

ఆ లెక్కన కొత్త సినిమాలకు పారితోషకం హైక్ చేసినా 60 లక్షల వరకూ వెళ్లాలి. కానీ అమ్మడు మాత్రం ఏకండా రౌండ్ ఫిగర్ కోటి చెబుతుంటే ఆశ్చర్యపోతున్నారట. అయితే ఇలా డిమాండ్ చేయడానికి ప్రధానంగా ఓ కారణం హైలైట్ అవుతోంది.

బాలకృష్ణ సమకాలీకులైన చిరంజీవి..నాగార్జున..వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలకు హీరోయిన్లను ఎంపిక చేయడం దర్శకులకు ఇబ్బందిగా మారుతోన్న సంగతి తెలిసిందే. చాలా కాలంగా ఈ సమస్య ఉంది. నవతరం భామల్ని ఎంపిక చేసినా వయసు వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. మరీ సీనియర్ హీరోయిన్లని తీసుకోవాలన్నా? ఆదోరకమైన ఇబ్బంది. అందుకే అలాంటి హీరోలకు ప్రగ్యా జైశ్వాల్..శ్రియ.. నిత్యా మీనన్ లాంటి వారు ఓ ఆప్షన్ గా కనిపిస్తున్నారు. అదే అదునుగా సదరు హీరోయిన్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.