ఏంటి పున్నూ… ఇదంతా పబ్లిసిటీ కోసమా?

ఉయ్యాలా జంపాల నటి పునర్నవి భూపాళం బిగ్ బాస్ సీజన్ 3 లో పార్టిసిపేట్ చేసిన విషయం తెల్సిందే. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తో ఆమె లవ్ ట్రాక్ బిగ్ బాస్ కు స్పైస్ ను తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ నుండి వచ్చాక అడపాదడపా ఈవెంట్ లలో పాల్గొన్న పునర్నవి భూపాళం, సడెన్ గా నిన్న పెట్టిన ఒక పోస్ట్ నెటిజన్లకు చిన్న పాటి షాక్ ఇచ్చింది.

తన చేతికి ఉంగరం ఉన్న ఫోటోను షేర్ చేసింది పునర్నవి. “మొత్తానికి జరుగుతోంది” అనే క్యాప్షన్ ను కూడా జతచేసింది. దీంతో అందరూ ఆమెకు ఎంగేజ్మెంట్ జరిగిందనే అనుకున్నారు. దీనికి తోడు కొద్దిసేపటి క్రితం ఉద్బవ్ రఘునందన్ అనే నటుడు “ఫైనల్ గా తను ఎస్ చెప్పింది. రేపు ఒక ఎగ్జైటింగ్ న్యూస్ ను మీతో షేర్ చేయడానికి ఎదురుచూస్తున్నా” అని పోస్ట్ చేయడంతో చాలా మంది వీరిద్దరికీ పెళ్లి అని ఫిక్స్ అయిపోయారు.

అయితే అసలు విషయం వేరే ఉంది. ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని తెలుస్తోంది. ఈ నటులు ఇద్దరూ కలిసి పెర్మనెంట్ రూమ్ మేట్స్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. దీనికి సంబంధించిన పబ్లిసిటీ కోసమే ఇదంతా చేసారని సమాచారం.