షాకిచ్చే రూపంతో పరేషానులే..!

ఆరు నెలలు ఆమెతో స్నేహం చేస్తే ఈమే ఆమె అయినట్టు… ఈమె ఎవరో కానీ ఆమెలా అయ్యింది! ఇంతకీ ఎవరీమె..? కనిపెట్టినవారికి 1000 డాలర్లు బహుమానం!!

ఇటీవలి కాలంలో ఫిట్నెస్ ప్రీక్ శ్రుతిహాసన్ వరుసగా వెస్ట్రన్ లుక్ లో డార్క్ మేకప్ తో కనిపిస్తూ షాక్ ల మీద షాక్ లిస్తోంది. ఈమె ఎవరు? అంటూ అంతా కన్ఫ్యూజ్ అయ్యేంతగా గెటప్ ఛేంజ్ చేస్తోంది. అడిగితే ఇదంతా గోథిక్ పై ప్రేమ అని అంటోంది. అయితే అభిమానులు మాత్రం శ్రుతికి ఇంకేదో అయ్యింది! అంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారు.

అన్నట్టు శ్రుతి ఫ్రెండు కూడా అలానే అయినట్టుంది. ఉన్నట్టుండి ఇలా అయ్యింది.ఈ ఫోటో చూస్తున్నారు కదా..! ఊహించని ఈ కొత్త రూపంతో షాక్ ల మీద షాక్ లిస్తోంది. అసలింతకీ ఏమైంది? అంటే.. నిరంతరం జిమ్ లో అవసరానికి మించి కసరత్తులు చేస్తున్న ఈ బ్యూటీ రూపం అమాంతం మారిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ ఫోటోషూట్ లో ఆ మారిన రూపం ఎంతో వెరైటీగా కనిపిస్తోంది. ఉన్నట్టుండి ఇలా అయ్యిందేమిటి.. ఇదంతా ఆమె ప్రభావమేనా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ క్రొత్త రూపం కొంత విస్మయానికి మరికొంత దిగ్భ్రాంతికి గురిచేస్తోంది అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఎంత బాలీవుడ్ పిచ్చి ఉంటే మాత్రం మరీ ఇంతగానా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ బ్యూటీ సైజ్ జీరో లుక్ పై దృష్టి సారించడం వల్ల వచ్చిన ముప్పు ఇదని విశ్లేషిస్తున్నారు. అన్నట్టు.. ఇటీవల తెలుగులో అవకాశాలు తగ్గిపోయిన ఈ బ్యూటీ బాలీవుడ్ ఒక్కటే తనకు సరైనదని భావించి పూర్తిగా అటువైపు వెళ్లినట్టేనా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఈ సన్నజాజి రెమ్మ ఎవరో కనిపెట్టేసినట్టే కదా!!