సైలెంట్ గా షూట్ లో జాయిన్ అయిన రకుల్ ప్రీత్

తన అందం, నటనతో ఇప్పటికీ తెలుగు టాప్ హీరోయిన్స్ లిస్టులో కొనసాగుతున్న భామ రకుల్ ప్రీత్ సింగ్. ఎప్పుడు కెరీర్లో బిజీగా ఉంటూనే హెల్త్ విషయంలో జిం, యోగా, డైట్ అంటూ అందరినీ మోటివేట్ చేసే రకుల్ కి రియా చక్రబోర్తి రూపంలో షాక్ తగిలిన విషయం తెలిసిందే.. ఈ విషయంలో మొదటి నుంచి సైలెంట్ గా ఉన్న రకుల్ సైలెంట్ గా ఢిల్లీ వెళ్లి పిటీషన్ వేసి, ఇన్వెస్టిగేషన్ లో హాజరై వచ్చింది.

ఈ డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చే టైంకి రకుల్ ప్రీత్ క్రిష్ డైరెక్షన్ లో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న రెండవ సినిమాలో నటిస్తోంది.. ఈ కేసు వలన షూట్ కి బ్రేక్ ఇచ్చింది. క్రిష్ రకుల్ ని మార్చేయాలనుకుంటున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. రకుల్ ప్రీత్ బ్యాక్ టు వర్క్ అని తన టీం చెబుతోంది..

ప్రస్తుతం వికారాబాద్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న షూటింగ్ లో రకుల్ ప్రీత్ కూడా పాల్గొంటోంది. రకుల్ ప్రీత్ సోషల్ మీడియాకి దూరంగా, తన పని తానూ చేసుకుంటూ వెళ్తోందని, ప్రస్తుతం తాను మొత్తంగా 7 సినిమాలు సైన్ చేసిందని, వాటికి సమందించిన డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ తన పని తానూ చేసుకుపోతోందని రకుల్ సన్నిహితులు చెబుతున్నారు.

వీలైనంత తక్కువ మంది టీంతో 30 రోజుల పాటు జరిగే ఒకే షెడ్యూల్ లో షూటింగ్ మొత్తం ఫినిష్ చేసేలా క్రిష్ ఈ సినిమా షూటింగ్ ప్లాన్ చేసాడు. క్రిష్ ఈ చిత్రాన్ని తన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.