చరణ్‌, సల్మాన్‌ కలిసి నటించబోతున్నారా?

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. నిర్మాత దిల్‌ రాజు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా జూన్‌ లేదా జులైలో పట్టాలెక్కబోతున్నట్లుగా ప్రకటించాడు. దాంతో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో స్టార్‌ హీరో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ హీరో ఎవరు అనే విషయమై మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. మొదట పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.. ఆ తర్వాత చిరంజీవి అంటూ కథనాలు వచ్చాయి. తాజాగా మరో హీరో పేరు ప్రస్థావనకు వచ్చింది.

శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న ఈ భారీ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ కనిపించబోఉన్నాడట. సినిమాలోని ఆ కీలక పాత్రను సల్మాన్‌ ఖాన్‌ ను తీసుకోవడం వల్ల బాలీవుడ్‌ లో ఈ సినిమా కు భారీ బిజినెస్‌ చేయడం ఖాయం. కనుక కాస్త ఎక్కువ ఖర్చు అయినా కూడా సల్మాన్‌ ఖాన్‌ ను ఈ సినిమాలో నటింపజేయాలని భావిస్తున్నారట. చరణ్‌ తో సల్మాన్‌ ఖాన్‌ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ కారణంగా సినిమా లో సల్మాన్‌ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వస్తుందేమో చూద్దాం.