చరణ్‌ హ్యాండిచ్చాడు… తారక్‌ ఛాన్సిచ్చాడు

హీరోయిన్‌గా పరిచయమై చాలా కాలమవుతున్నా, తన ముగ్ధ మనోహర రూపంతో కుర్రాళ్ల మనసులు కొల్లగొట్టినా, రాశి ఖన్నాకి ఇంతవరకు చెప్పుకోతగ్గ బ్రేక్‌ రాలేదు. కొన్ని మీడియం రేంజ్‌ సినిమాలతో గుర్తింపు అయితే తెచ్చుకుంది కానీ ఏ హీరోయిన్‌ అయినా ఆశించే ఆ బిగ్‌ బ్రేక్‌ రాశికి ఇంకా దక్కలేదు.

సుకుమార్‌ డైరెక్షన్‌లో చరణ్‌ హీరోగా నటిస్తున్న చిత్రంలో ఛాన్స్‌ వచ్చినట్టే వచ్చి చేజారింది. రాశితో చిన్న ఫోటోషూట్‌ చేసి కాస్త బరువు తగ్గమని సుకుమార్‌ సూచిస్తే అవకాశం దొరికేసినట్టే అనుకుంది కానీ మళ్లీ అటు నుంచి పిలుపు రాలేదు. అయితే పడ్డ కష్టం, తగ్గిన బరువు వృధా పోలేదు. రాశికి ఇప్పుడు ఎన్టీఆర్‌తో జోడీ కట్టే ఛాన్స్‌ దక్కింది.

బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో రూపొందుతోన్న ‘జై లవకుశ’లో ఒక హీరోయిన్‌గా రాశి ఛాన్స్‌ కొట్టేసింది. చిన్న సినిమాల్లోనే గ్లామర్‌ విందుతో రెచ్చిపోతున్న రాశి ఈ పెద్ద ఆఫర్‌ని మాగ్జిమం క్యాష్‌ చేసుకోవడానికి ఇంకే రేంజ్‌లో రెచ్చిపోతుందో చూడాల్సిందే. ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటిస్తారు కానీ ఇంకా ఫైనలైజ్‌ కాలేదు. వరుసగా నలభై రోజులు డేట్స్‌ ఇచ్చే హీరోయిన్ల కోసమే చూస్తున్నారు. ఆగస్టులో విడుదల చేసి తీరాలంటే బిజీ హీరోయిన్లతో పెట్టుకుంటే కుదరదని ఇలా డిసైడయ్యారు.