మాస్‌ రాజా కోసం గద్దలకొండ ఐటెం బ్యూటీ

వరుణ్‌ తేజ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన గద్దలకొండ గణేష్‌ చిత్రంలో ఐటెం సాంగ్‌ చేసిన ముద్దుగుమ్మ డింపుల్‌ హయతి తన తదుపరి తెలుగు సినిమాకు కమిట్‌ అయ్యింది. ఈసారి డింపుల్‌ హీరోయిన్‌ గా అలరించేందుకు రెడీ అవుతుంది.

ప్రస్తుతం ఈమె కన్నడంలో ఒక సినిమాను చేస్తోంది. తెలుగులో హీరోయిన్‌ గా నటించేందుకు చాలానే ప్రయత్నాలు చేసింది. ఎట్టకేలకు ఈమెకు ఒక మంచి మాస్ మసాలా సినిమాలో నటించే అవకాశం దక్కింది.

గద్దలకొండ తర్వాత చిన్నా చితకా ఆఫర్లు వచ్చినా వాటిని పట్టించుకోని డింపుల్‌ హయతి తాజాగా రవితేజ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో హీరోయిన్‌గా చేసేందుకు గాను కమిట్‌ అయ్యింది.

తెలుగులో రవితేజ మూవీలో నటించి పాపులారిటీ పెంచుకోవాలని ఈమె భావిస్తుంది. అందుకే ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది ఈ అమ్మడు. ప్రస్తుతం రవితేజ క్రాక్‌ సినిమాను చేస్తున్నాడు. అతి త్వరలోనే ఆ సినిమా షూటింగ్‌ ముగియబోతుంది. ఆ వెంటనే రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ సినిమా పట్టాలెక్కబోతుంది.

భారీ అంచనాలున్న వీరిద్దరి కాంబో మూవీలో హయతి హీరోయిన్‌ గా నటిస్తే సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్‌ సభ్యులు ఆశిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అయినా తెలుగు ఇండస్ట్రీలో ఈ అమ్మడు నిలదొక్కుకుంటుందేమో చూడాలి.