ఎక్స్ క్లూజివ్: తండ్రి కొడుకు గా మరోసారి మాస్ రాజా

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ అతి త్వరలో మొదలు కాబోతుంది. ఆ సినిమా షూటింగ్ మొదలు కాబోతున్న సమయంలో సినిమాకు సంబంధించి ఆసక్తి కర వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాలో రవితేజ తండ్రి కొడుకు పాత్రలో కనిపించబోతున్నాడు. గతంలో రవితేజ ద్విపాత్రాభినయం చేయడం జరిగింది. రవి తేజ మరో సారి డబుల్ రోల్ లో కనిపించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ పై ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు భారీ ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఖిలాడీ సినిమా విడుదల కాకముందే పట్టాలెక్కే అవకాశం ఉంది అంటున్నారు.