సంజయ్ దత్, రేఖలకు పెళ్లయిందా?

అరవైల్లోనూ కుర్ర పిల్లలా కనిపించే బాలీవుడ్ సీనియర్ యాక్టర్ రేఖ జీవిత చరిత్ర గురించి వినిపిస్తున్న వదంతులు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఆమెకు హీరో సంజయ్ దత్ తో ఉన్న సంబంధాలు.. వాళ్లిద్దరికీ పెళ్లి కూడా అయిందన్న విషయం అందులో ఉందని అంటున్నారు.  అయితే.. ఆ జీవిత చరిత్రను రాసిన వ్యక్తి మాత్రం అదంతా అవాస్తవమని.. తానేమీ అలాంటి విషయాలను రాయలేదని చెబుతున్నారు. అయినా.. సోషల్ మీడియాలో మాత్రం దీనిపై తెగ ప్రచారం జరుగుతోంది.

రేఖ జీవిత చరిత్ర ‘రేఖ – ద అన్ టోల్డ్ స్టోరీ’ సంచలనం రేపుతోంది. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలలు  సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ హీరో సంజయ్ దత్, రేఖలు పెళ్లి చేసుకున్న విషయం ఈ పుస్తకంలో ఉందనే విషయం చర్చనీయాంశం అవుతోంది. అయితే, ఈ పుస్తక రచయిత యాసిర్ ఉస్మాన్ మాత్రం ఖండిస్తున్నారు. అవన్నీ పుకార్లేనని చెప్పాడు. ఈ పుస్తకంలో రేఖ, సంజయ్ దత్ పెళ్లి విషయం గురించి రాయలేదని చెబుతున్నాడు.

భర్త ముఖేశ్‌ అగర్వాల్‌ చనిపోయిన తర్వాత కూడా రేఖ నుదుటిపై కుంకుమ పెట్టుకునేది. సంజయ్‌ దత్‌ని రహస్యంగా వివాహం చేసుకోవడం వల్లే నుదుల కుంకుమ పెట్టుకునేదని ప్రచారమవుతోంది.  1984లో వచ్చిన జమీన్‌ ఆస్మాన్‌ సినిమా చిత్రీకరణ సమయంలో రేఖ.. సంజయ్‌ ప్రేమించుకున్నారని అదే సమయంలో ఇద్దరూ వివాహం చేసుకున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. సంజయ్‌ కంటే ఐదేళ్లు పెద్దదైన రేఖ పెళ్లైన తర్వాత అతనితో కొన్ని వారాల పాటు ముంబయి నుంచి దూరంగా వెళ్లిపోయిందని కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది.  ఆ తర్వాత సంజయ్‌ తండ్రి సునీల్‌దత్‌కి వీరి ప్రేమ విషయం తెలీగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంజయ్‌కి రిచాశర్మతో వివాహం జరిపించారని చెబుతున్నారు.

కాగా అనంతర కాలంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంలో రేఖతో పెళ్లి విషయం గురించి సంజయ్ దత్ ను అడిగితే… ఆయన ఆ వార్తను ఖండించలేదు. దీంతో, వీరి పెళ్లి విషయం వాస్తవమే అని చాలామంది  భావించారు.  అయితే.. ఈ పుస్తకాన్ని రాసిన ఉస్మాన్ మాత్రం వాళ్లిద్దరికీ పెళ్లి కాలేదని అంటున్నాడు. రేఖకు సంజయ్ దత్ కొద్దికాలం అండగా ఉండేవాడని.. ఆ కారణంగానే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారంటూ అందరూ పొరపాటు పడ్డారని చెబుతున్నారు. మరి.. పెళ్లి కాకపోయినా అఫైర్ ఉందా లేదా అన్నది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు.