పాతికేళ్ల క్రితం సీన్‌ రిపీట్‌ చేయబోతున్న వర్మ

రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ఒకప్పుడు ప్రేక్షులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవారు. కాని ఇప్పుడు మాత్రం వర్మ తీశాడు అంటే పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ లాక్‌ డౌన్‌లో కరోనా వైరస్‌ అనే సినిమాను తెరకెక్కించిన వర్మ త్వరలో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అలాగే క్లైమాక్స్‌ అనే ఒక డిజిటల్‌ మూవీని కూడా వర్మ విడుదలకు రెడీ చేస్తున్నాడు.

వర్మ తాను తీసిన సినిమాలు విడుదలకు విభిన్నమైన పబ్లిసిటీ పంధాను ఎంచుకుంటాడు. త్వరలో విడుదల కాబోతున్న సినిమాల ప్రమోషన్‌ లో భాగంగా వర్మ మరో సినిమాను ప్రకటించాడు. ఒక పూర్తి స్థాయి హర్రర్‌ సినిమాను చేస్తానంటూ ఆయన పేర్కొన్నాడు. దాదాపు పాతిక సంవత్సరాల క్రితం వచ్చిన దెయం సినిమాకు సీక్వెల్‌గా భయం అనే సినిమా చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు.

వర్మ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకు వెళ్లిన సినిమాగా దెయ్యం నిలుస్తుంది. హాలీవుడ్‌ రేంజ్‌ హర్రర్‌ సినిమాను ఇండియన్‌ స్క్రీన్‌పై ప్రేక్షకులకు చూపించిన ఘనత వర్మకు దక్కుతుంది. ఈమద్య కాలంలో భారీ హర్రర్‌ సినిమాలు వచ్చిందే లేదు. మళ్లీ వర్మ భయం సినిమాను తీస్తానంటూ ప్రకటించడంతో ప్రేక్షకుల్లో ఏదో మూలన ఆసక్తి కనిపిస్తుంది. వర్మ ఇటీవల చేస్తున్నట్లుగానే భయంను తెరకెక్కిస్తాడా లేదంటే దెయ్యం సినిమా రేంజ్‌లోనే సీక్వెల్‌ ను తీస్తాడా అనేది చూడాలి.