బ్రేకింగ్: ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.!

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు, జక్కన్నగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్నా సినిమా ‘ఆర్ఆర్ఆర్‘. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా వరకే బాలన్స్ ఉంది. అనుకున్న షెడ్యూల్స్ కాన్సల్ అవ్వడం లేదా పోస్ట్ ఫోన్ అవుతుండడంతో సినిమా ఎప్పటికి పూర్తవుతుందో కచ్చితమైన క్లారిటీ లేదు.

ఫైనల్ గా ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ చిత్ర టీం రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. 2021 దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ వార్త ఫుల్ కిక్ ఇవ్వడంతో ఇండియా వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతోంది. ఇది పూర్తవ్వగానే రామ్ చరణ్ – అలియా భట్ లపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించి షూటింగ్ ని ఫినిష్ చేయనున్నారు.