నలభై కోట్ల మీద కన్నేసిన సాయిధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్కి ఇప్పుడు పాతిక కోట్ల మార్కెట్ అయితే ఖచ్చితంగా వుంది. సుప్రీమ్ హిట్టుతో అతని మలి చిత్రం విన్నర్కి కూడా బిజినెస్ క్రేజ్ బాగా వుంది. అయితే మీడియం రేంజ్ చిత్రాల నుంచి నెక్స్ట్ లెవల్కి వెళ్లాలంటే ఒక స్టార్ డైరెక్టర్తో సినిమా చేయడం తప్పనిసరి. స్టార్ దర్శకుల పిలుపు కోసం వేచి చూస్తూ, వెంట పడుతూ కూర్చున్న సాయి ధరమ్ తేజ్కి ఫైనల్గా వినాయక్తో సినిమా కుదిరింది.

‘ఖైదీ నంబర్ 150’ తర్వాత ఏ సినిమా కమిట్ కాని వినాయక్ తన మలి చిత్రాన్ని తేజ్తోనే చేస్తానని మాటిచ్చాడు. అయితే దీనికి ఇంకా కథ, నిర్మాత ఏదీ సెట్ కాలేదు. విన్నర్ తర్వాత బి.వి.ఎస్. రవి డైరెక్షన్లో ‘జవాన్’ చేయబోతున్న సాయి ధరమ్ తేజ్ ఆ తదుపరి చిత్రాన్ని వినాయక్తో చేస్తాడు. తేజ్కి తగ్గ కథ కోసం వినాయక్ అన్వేషిస్తున్నాడు. ఖైదీ తర్వాత వినాయక్ చిత్రం కనుక దీనికి వుండే క్రేజ్ ఏంటనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆల్రెడీ పాతిక కోట్ల మార్కెట్ వున్న తేజ్కి మరింత మాస్ ఫాలోయింగ్ పెంచి నలభై కోట్ల హీరోగా నిలబెట్టడం వినాయక్కి అంత కష్టం కాదు.

తన మార్కు వినోదంతో కూడిన కృష్ణ, నాయక్, అదుర్స్ లాంటి సబ్జెక్ట్ కోసం వినాయక్ చూస్తున్నాడు. ఒక్కసారి లైన్ ఓకే అయినట్టయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేసినట్టే. వరుసగా మంచి నిర్ణయాలు తీసుకుంటోన్న తేజ్ ఈ చిత్రంతో నెక్స్ట్ లెవల్కి వెళ్లిపోతాడనే అనుకోవచ్చు.