సల్మాన్ ఖాన్ సినిమాలో హీరోయిన్ గా బాలయ్య హీరోయిన్

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే ఈ భామ ప్రస్తుతం సూపర్ ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న అంతిమ్ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికైంది.

సల్మాన్ ఖాన్-ఆయుష్ శర్మ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఇటీవలే వచ్చిన అంతిమ్ టీజర్ కూడా విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహిమ మక్వాన ఒక హీరోయిన్ గా ఎంపికైంది. మహేష్ మంజ్రేకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన నటించే హీరోయిన్ విషయంలో సస్పెన్స్ అలాగే కొనసాగుతోంది.

తాజా సమాచారం ప్రకారం ప్రగ్యా జైస్వాల్ సల్మాన్ ఖాన్ తో నటించనుంది. వీరిద్దరికీ ఈ సినిమాలో ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని సమాచారం. మహాబలేశ్వర్ లో సాగుతోన్న తాజా షెడ్యూల్ లో ఈమె పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.