ఎక్స్ క్లూజివ్: సమంత ‘సాకి వరల్డ్‌’ కు ముహూర్తం ఖరారు

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ఇటీవలే తన సొంత బ్రాండ్‌ సాకి వరల్డ్‌ ను ప్రకటించిన విషయం తెల్సిందే. సెలబ్రెటీల నుండి సామాన్యుల వరకు అందరికి అందుబాటులో ఉండే రేట్లతో విభిన్నమైన రేట్లతో యువతను ఆకట్టుకునే బ్రాండ్స్‌ తో సాకి వరల్డ్‌ స్టోర్‌ ఉంటుందని సమంత పేర్కొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సాకి స్టోర్స్‌ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా ఇప్పటికే ఆమె ప్రకటించారు. అందులో భాగంగా మొదటి స్టోర్‌ ను హైదరాబాద్‌ లో ఆమె ఈనెల 28న ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

అక్కినేని అమల నాగార్జునలతో పాటు దగ్గుబాటి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనబోతున్నట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సమంత సాకి వరల్డ్‌ స్టోర్‌ ను సందర్శించేందుకు ఆమె అభిమానులతో పాటు వస్త్ర ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె సినిమాల మాదిరిగానే ఆమె స్టోర్‌ కూడా తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుందని ఆమె సినిమాల మాదిరిగా అన్ని వర్గాల వారిని కూడా ఆమె స్టోర్‌ మెప్పించే విధంగా ఉంటుందని నెటిజన్స్‌ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ఆమె జాను సినిమాతో ఈ ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత మళ్లీ ఏ సినిమాలో కూడా నటించలేదు. ది ఫ్యామిలీ మెన్‌ 2 వెబ్‌ సిరీస్‌ ఈ ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందులో పాకిస్తానీ ఉగ్రవాది పాత్రలో నెగటివ్‌ షేడ్ లో సమంత కనిపించబోతుంది. ఆ తర్వాత తమిళంలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఒక సినిమాలో విజయ్‌ సేతుపతి మరియు నయనతారలతో కలిసి నటించేందుకు ఓకే చెప్పిందట.