బిగ్‌ బాస్‌ దసరా స్పెషల్‌.. సమంత 3 గంటల షో

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు గెస్ట్‌ హోస్ట్‌ రాబోతున్నట్లుగా మూడు వారాలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వారం కూడా గెస్ట్‌ హోస్ట్‌ గురించి ప్రచారం జరుగుతోంది. కాని గత రెండు మూడు వారాలుగా వచ్చిన వార్తలు నిజం కాలేదు కనుక ఈ వారం కూడా నిజం కాదేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. కాని ఇటీవల నాగార్జున మనాలీకి వెళ్లాను అంటూ స్వయంగా ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అక్కడ ఉన్న వీడియోను కూడా షేర్‌ చేశాడు. కనుక నాగార్జున ఈ వారం ఖచ్చితంగా బిగ్‌ బాస్‌ హోస్టింగ్‌ చేయడం లేదు అంటున్నారు.

వైల్డ్‌ డాగ్‌ కోసం ఏకంగా 21 రోజుల పాటు అక్కడే నాగార్జున టీం ఉండబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్‌ బాస్‌ హోస్టింగ్‌ ఎవరు అంటూ అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సమయంలో నాగార్జున స్థానంలో సమంత వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బిగ్‌ బాస్‌ గత సీజన్‌ లో రమ్యకృష్ణ గెస్ట్‌ హోస్ట్‌గా వచ్చింది. ఈసారి రోజా వస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. గత సీజన్‌ లో సమంత వస్తుందని ప్రచారం జరిగింది. కాని రమ్యకృష్ణ వచ్చింది. ఈసారి కూడా సమంత అంటూ వార్తలు వస్తున్నాయి. కాని ఈసారి ఖచ్చితంగా సమంత వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

రేపు దసరా సందర్బంగా భారీ సందడికి బిగ్‌బాస్‌ టీం ప్రయత్నాలు చేస్తున్నారు. సమంత రావడంతో పాటు ప్రత్యేకంగా దసరా ఎపిసోడ్‌ అవ్వడం వల్ల ప్రత్యేకంగా ఉండబోతుంది. బిగ్‌ బాస్‌ కు ఆశించిన స్తాయిలో రేటింగ్స్‌ రావడం లేదు. అందుకే బిగ్‌ బాస్‌ నిర్వాహకులు దసరా ను వాడేసుకోవాలని సమంతను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట.

మూడు గంటల పాటు సమంత హోస్టింగ్‌ తో రేపు బిగ్‌బాస్‌ షో ఉంటుందట. స్టార్‌ మా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రేపు సాయంత్రం ఆరు గంటలకు ఆరంభం అయ్యే షో రాత్రి 9 గంటల వరకు అంటూ ముడు గంటల పాటు కొనసాగబోతుంది. ప్రారంభం రోజు చివరి రోజు మాత్రమే అలా జరుగుతుంది. కాని ఈసారి మాత్రం దసరా సందర్బంగా ఇలా ప్లాన్‌ చేశారు. సమంత హోస్టింగ్‌తో మూడు గంటలు అంటూ ఖచ్చితంగా ఆట అదిరి పోవడం ఖాయం.