హాట్ ఫోటో: బాత్‌ టబ్‌ లో సమంత ఊరించే అందాలు

అక్కినేని సమంత ఈ మధ్య కాలంలో కాస్త బోల్డ్‌ గా కనిపించడం నటించడం చేయడం లేదు అనుకుంటూ ఉన్నాం. ఆమె చైతూను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా పద్దతిగా కనిపిస్తుంది అంటూ అక్కినేని అభిమానులు సైతం అంటున్నారు.

అయితే తాజాగా అందరిక షాక్‌ ఇచ్చి ఇన్‌స్టాగ్రామ్‌ లో ఈ ఫొటోను షేర్‌ చేసింది. బాత్‌ టబ్‌ లో జలకాలాట సందర్బంగా ఈ ఫొటోను సమంత తీసుకుంది. ఇలాంటి ఫొటోలు సోషల్‌ మీడియాలో ఇతరులు పోస్ట్‌ చేయగా చాలానే చూశాం. కాని సమంత నుండి ఇలాంటి పోస్ట్‌ను చాలా మంది ఒప్పుకోలేక పోతున్నారు.

హీరోయిన్‌గా ఈమధ్య కాలంలో కొత్తగా సినిమాలు ఏమీ ప్రారంభించని సమంత ముందుముందు సినిమాల్లో నటించే అవకాశం ఉందా లేదా అనే అనుమానం కూడా ఉంది. ప్రస్తుతం సమంత ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతుంది. ఇదే సమయంలో ఈమె ఆహా కోసం సామ్‌ జామ్‌ టాక్‌ షో తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ ఎపిసోడ్‌ అయ్యింది. వచ్చే వారం రానాతో ఆ తర్వాత చిరంజీవితో షో ఉండబోతుంది.

Share