సమంతకు దక్కిన అరుదైన గౌరవం

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ సమంత ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్ లో నటించిన విషయం తెల్సిందే. హిందీలో రూపొందిన ఫ్యామిలీ మ్యాన్ 2 వచ్చే నెలలో అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. భారీ అంచనాలున్న ఈ వెబ్‌ సిరీస్ కు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్‌ మీడియాను చుట్టేస్తున్నాయి. మొదటి సారి సమంత నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రమోసన్ కార్యక్రమాల్లో సమంత ముంబయిలో జోరుగా పాల్గొంటుంది.

ఇక ఈ వెబ్ సిరీస్ లో నటించినందుకు గాను సమంతకు ఒక అరుదైన గౌరవం దక్కబోతుంది. వెబ్ సిరీస్‌ ప్రమోషన్ లో భాగంగా ట్విట్టర్ లో ఒక ఈమోజీని సమంత ఫేస్ తో విడుదల చేయబోతున్నారట. అందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే ట్విట్టర్ లో సమంత ఫేస్ తో ఈమోజీ ని మనం అంతా కూడా చూడబోతున్నాం. ఇప్పటి వరకు హీరోలకు ఈమోజీలు వచ్చాయి. కాని ఒక హీరోయిన్‌ కు ట్విట్టర్లో ఈమోజీలు రావడం మొదటి సారి. ఇది నిజంగా మనం అంతా గర్వించదగ్గ విషయం.