‘సమంత’కు పూజా క్షమాపణలు చెప్పాల్సిందే

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇన్స్టా ఖాతాలో నిన్న వచ్చిన ఒక పోస్టు తాజాగా దుమారానికి కారణమయింది. ఆ పోస్టులో మజిలీ చిత్రంలోని సమంతా ఫోటోకు ‘ఏమంత అందంగా లేదు’ అంటూ క్యాప్షన్ జతచేసి ఉంది. సదరు పోస్టు పెట్టిన కొన్ని గంటలకు పూజా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన ఇన్టా్య ఖాతా హ్యాక్ అయిందని తన టీం తెలియచేసారని, దానిలో వచ్చిన పోస్టులను పట్టించుకోవద్దని ఫాలోవర్లను కోరింది. ఈ విషయంలో తన డిజిటల్ టీమ్ వర్క్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది.

కొంత సేపటి తర్వాత తన డిజిటల్ టీమ్ కు కృతజ్ఞతలు చెప్తూ పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చిందని వెల్లడించింది. హ్యాకర్లపై నోరు కూడా పారేసుకుంది. ఇదిలా ఉంటే కొందరు నెటిజన్లు మాత్రం దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. పూజ హెగ్డే ఖాతా నిజంగా హ్యాకింగ్ అయిందా అని అనుమానాలు లేవనెత్తారు. పూజా ఖాతాలో పెట్టిన సమంత పోస్టు స్క్రీన్ షాట్ ను జోడిస్తూ ‘సమంతకి ఉన్న క్రేజ్ ను చూస్తుంటే నీకు ఈర్ష్యగా ఉంది. అందుకే నోరు జారి కామెంట్ పెట్టి ఇప్పుడు కవరింగ్ చేసుకుంటున్నావా అంటూ ఘాటుగానే విమర్శలు గుప్పించారు. కొంతమంది సమంత ఫాలోవర్లు అయితే మరింత ముందుకెళ్ళి సమంతకు క్షమాపణలు చెప్పాలి అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తూ పూజను ట్రోల్ చేయడం కూడా ప్రారంభించారు.

వాస్తవానికి ఈ పోస్టును పూజనే చేసిందో లేక హ్యాకర్లు చేసారో అనేది తెలియదు కానీ ఎక్కువమంది మాత్రం ‘హ్యాకింగ్ లేదు, ఏం లేదు..పూజ కావాలని చేసింది” అంటున్నారు. అయితే ఈ కామెంట్లపై బుట్టబొమ్మ మాత్రం ఇంకా స్పందించలేదు. స్పందిస్తుందో లేదో చూడాలి

Share