సమంత ఎమోషనల్ ట్వీట్..! నాగ చైతన్యను ఉద్దేశించేనా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం ‘చైసామ్’ ల విషయమే. ఎంతో చూడముచ్చటగా, అన్యోన్యంగా కనిపించిన నాగ చైతన్య, సమంతల జంట మధ్య మనస్పర్థలు వచ్చాయనే పుకార్లు బాగా షికారు చేస్తున్నాయి. దీనిపై వీరిరువురూ ఇప్పటివరకు ఎక్కడా స్పందించకపోయినా వారి చర్యలు మాత్రం వారిద్దరి వివాహ బంధంపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఇటీవల సైమా అవార్డుల్లో ‘ఓ బేబీ’ సినిమాలో నటనకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. కానీ సమంత ఈ ఈవెంట్‌కే హాజరు కాలేదు. నాగ చైతన్య లవ్ స్టోరీ ఈవెంట్ కి వెళ్లినా ప్రమోషన్స్‌కు వీలైనంత దూరంగానే ఉంటున్నాడు. కావాలనే చైతన్య, సమంత మీడియాకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఇటీవల తిరుమలలో మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు.. ‘గుడికి వచ్చా.. బుద్ది లేదా..? ఘాటుగా స్పందించడంతో వీరు నోరు విప్పకూడదని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది.

ఈనేపధ్యంలో సమంత తాజాగా షేర్ చేసిన ఆంగ్ల మూవీ కొటేషన్స్ వైరల్ అవుతున్నాయి. ‘నువ్వు నన్ను బాధపెట్టి వుండొచ్చు..నేను నిన్ను బాధ పెట్టి వుండొచ్చు. ఒకరిని ఒకరం బాధ పెట్టుకుని వుండొచ్చు. మొత్తానికి రియాల్టీ ఇదే.. వసంత కాలాన్ని పొందాలంటే శిశిరాన్ని కూడా భరించాలి’ అని పోస్ట్ చేసింది. అవి నాగ చైతన్యను ఉద్దేశించి చేసినవేనా? అనే కామెంట్స్ వస్తున్నాయి.