సమంత లవ్ స్టోరీ నుంచి ఒక పేజీ

చెన్న‌య్ బ్యూటీ సమంత, సినీ హీరో అక్కినేని నాగచైతన్యకు ఈ నెల 29న వివాహ నిశ్చితార్థం జరగనున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎంతో సంబ‌ర‌ప‌డిపోతున్న స‌మంత తాను చైతుతో క‌లిసి న‌టించిన‌ ‘ఏ మాయ చేసావె’ చిత్రంలోని ఓ స్టిల్‌ను చెక్కుతూ ఉన్న ప్ర‌త్యేక‌ వీడియోను సోషల్ మీడియాా ద్వారా అభిమానుల‌తో పంచుకుంది. ‘నా లవ్‌స్టోరీ పేజీ నుంచి.. మీకు ప్రేమతో’ అని అందులో పేర్కొంది. స‌మంత పోస్ట్ చేసిన‌ ఈ వీడియోకు ఆమె అభిమానుల నుంచి భారీగా స్పంద‌న వ‌స్తోంది. అమెకు శుభాకాంక్ష‌లు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.

మరోవైపు ఈ చిన్నది హీరోయిన్ గా కెరీర్ ముగించి నిర్మాతగా కెరీర్ మొదలుపెట్టాలనుకుంటుందట. తన అభిరుచికి తగ్గా చిత్రాన్ని నిర్మించాలని ఈ చిన్నది గత కొంత కాలంగా ఆలోచిస్తూ వస్తోందట. తనను బాగా ఎలివేట్ చేసే కథా చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయాలన్నది ఈ ముద్దుగుమ్మ కోరికని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమధ్య కన్నడలో హిట్టయిన ‘యూ టర్న్’ సినిమా రీమేక్ హక్కులను తీసుకుందని వార్తలొస్తున్నాయి. నిర్మాతగా తన తొలి చిత్రానికి ఈ ప్రాజక్టు బాగా సరిపోతుందని సమంత నిర్ణయించుకుని ముందుకు వెళుతోందట.