ద‌స‌రాకే వారిద్ద‌రి పెళ్లంట‌!

జ‌న‌ర‌ల్ గా ఎంగేజ్ మెంట్ అయిపోయిందంటే.. పెళ్లికి త్వ‌ర‌త్వ‌ర‌గా అడుగులు ప‌డుతుంటాయి. కానీ.. నాగ‌చైత‌న్య‌.. స‌మంత‌ల వ్య‌వ‌హారం అందుకు భిన్నంగా. ఎంగేజ్ మెంట్ జ‌రిగి దాదాపుగా నాలుగు నెల‌లు అవుతున్నా.. ఇరువురు పెళ్లి విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా సినిమాల్లో బిజీబిజీగా ఉండిపోతున్నారు. మ‌రి.. కెరీర్ మీద ఫోక‌స్ చేస్తున్న వీరిద్ద‌రూ పెళ్లెప్పుడు చేసుకుంటార‌న్న‌ది ప్ర‌శ్న‌గామారింది. ఇదే విష‌యాన్ని ప‌లువురు అడిగినా.. స‌రైన స‌మాధానం రాని ప‌రిస్థితి.

ఈ మ‌ధ్య కాలంలో ప‌లు క‌మిట్ మెంట్స్ ఇచ్చేసిన వీరిద్ద‌రి తీరుతో.. పెళ్లి ఎప్పుడంటూ రాగాలు తీస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్ద‌రి పెళ్లి వ్య‌వ‌హారం మీద అక్కినేని ఫ్యామిలీతోక్లోజ్ గా ఉన్న వారి నుంచి ఆస‌క్తిక‌ర స‌మాచారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. కెరీర్ ప‌రంగా ఎన్ని క‌మిట్ మెంట్లు ఉన్నా.. ఈ అక్టోబ‌రు నాటికి వీరిద్ద‌రికి పెళ్లి చేసేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

డేట్ ఇంకా ఫిక్స్ కాన‌ప్ప‌టికీ.. వీరి పెళ్లి ఎట్టి ప‌రిస్థితుల్లోనూఅక్టోబ‌ర్ నాటికి జ‌రిగిపోవ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. హిందూ.. క్రైస్త‌వ సంప్ర‌దాయం ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. వీలైనంత‌వ‌ర‌కూ పెళ్లి హైద‌రాబాద్‌లోనే చేయాల‌ని ఇరు వ‌ర్గాల వారు అనుకుంటున్న‌ట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఓకే చెప్పిన క‌మిట్ మెంట్స్ అక్టోబ‌రు నాటికి దాదాపు పూర్తి అవుతాయ‌ని.. మ్యారేజ్ త‌ర్వాత కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. ఈ ఇద్ద‌రి పెళ్లి మంత్ ఓకే అయ్యింది స‌రే.. డేట్ కూడా ఫిక్స్ చేస్తే పోలా..?