నా చెల్లికి చూసిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నా

బుల్లి తెర ప్రేక్షకులకు సుపరిచితురాలైన సమీరా షరీఫ్ ఆమద్య నటి సన తనయుడు అన్వర్‌ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత బుల్లి తెరపై ఎక్కువగా కనిపించని సమీరా సోషల్‌ మీడియా యూట్యూబ్‌ లో మాత్రం రెగ్యులర్‌ గా కనిపిస్తూ వస్తుంది. తాజాగా ఈమె భర్త అన్వర్‌ తో కలిసి ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలను గురించి ప్రస్థావించింది. ముఖ్యంగా అన్వర్‌ తో పరిచయం తన కుటుంబ పరిస్థితుల గురించి మొదటి సారి సమీరా నోరు విప్పింది.

అన్వర్‌ ను మొదటి సారి ఒక షాపింగ్ మాల్ లో చూశాను. ఆ సమయంలో నా వద్దకు వచ్చి ఫొటో తీసుకుంటాను అని అడిగాడు. ఫొటో తీసుకున్న తర్వాత నేను నటి సన తనయుడిని అంటూ చెప్పాడు. దాంతో కొద్ది సమయం మాట్లాడాను. అన్వర్‌ తో పరిచయం తర్వాత అతడితో నా చెల్లి పెళ్లి చేయాలనుకున్నాను. అక్క ప్రేమ వివాహం చేసుకుని వెళ్లి పోయిన కారణంగా చెల్లి బాధ్యత నాపై పడింది. అందుకే అన్వర్‌ తో ఆమె పెళ్లిని ఫిక్స్‌ చేయాలనుకున్నా కూడా మా ఇద్దరి మద్య పరిచయం ప్రేమగా మారి మేము వివాహం చేసుకున్నాము అంటూ సమీరా చెప్పుకొచ్చింది.