ఆన్ లైన్ లోకి షకీలా సినిమా

కరోనా ఎవరినీ వదలడం లేదు. పాపం, సీనియర్ సెక్సీ తార షకీలాను కూడా. స్వంత డబ్బులు పెట్టి, ఏడాదికి పైగా సెన్సారుతో పోరాడి సినిమా రెడీ చేస్తే, కరోనా వచ్చి అడ్డం పడిపోయింది. అప్పులకు వడ్డీ కట్టలేక కిందా మీదా అవుతోందట. అందుకే ఆఖరికి తన సినిమాను ఆన్ లైన్ లోకి వదిలేస్తున్నా అంటూ ప్రకటించింది. జస్ట్ యాభై రూపాయలు ఇవ్వండి చాలు. ఆన్ లైన్ లో చూసుకోండి అంటూ అపీల్ చేస్తోంది.

లేడీస్ నాట్ అలౌడ్ అంటూ టైటిల్, షకీలా నటించడం వంటి పాయింట్లు ఆన్ లైన్ లో జనం చూడడానికి బాగానే సరిపోతాయి. కానీ ఆర్జీవీ మాదిరిగా హడావుడి చేయాలి. జనాన్ని కిర్రెక్కించేలా కంటెంట్ వదలాలి. అప్పుడు టికెట్ లు తెగుతాయి ఆన్ లైన్ లో అయినా. పైగా అప్పుడు 300 టికెట్ పెట్టినా ఈ ఫొటోలు చూసి, కంటెంట్ చూసి ఎగబడతారు. ఆప్ కోర్స్ ఆ తరువాత అందులో ఏం లేదని తిట్టుకుంటారు.

అలా కాకుండా ఫుల్ సినిమా అయినా, యాభై రూపాయలే టికెట్ అయినా, ఇలా సింపుల్ గా వదిలేస్తే, చూస్తారంటారా? ఏమో షకీలా క్రేజ్ ఇంకా వుందేమో? ఈ దెబ్బతో తెలిసిపోతుంది.