ఎక్స్ క్లూజివ్: ‘నిశబ్దం’ టీంను ఆమె బాగా ఇబ్బందిపెట్టిందట

గత ఏడాది కాలంగా అనుష్క నిశబ్దం సినిమా గురించి మీడియాలో ప్రచారం జరుగుతుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే సినిమాను గత ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేవారు. కాని షూటింగ్‌ కాస్త ఆలస్యం అయ్యింది. ఈ ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా సాధ్యం కాలేదు. దాంతో ఏప్రిల్‌ లో విడుదలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమోషన్‌ కార్యక్రమాలు చేస్తున్న సమయంలో కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. థియేటర్ల కోసం ఇన్నాళ్లు వెయిట్‌ చేసిన మేకర్స్‌ చివరకు ఓటీటీ ద్వారా విడుదల చేస్తున్నారు. అక్టోబర్‌ 2న విడుదల కాబోతున్న ఈ సినిమాలో అనుష్క తో పాటు షాలిని పాండే కీలక పాత్రలో నటించింది. సినిమా చివరి దశ షూటింగ్‌ సమయంలో యూనిట్‌ సభ్యులను షాలిని పాండే చాలా ఇబ్బంది పెట్టిందట.

నిశబ్దం సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలోనే షాలిని పాండే బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ తో ఒప్పందం చేసుకుంది. గత జులై లో మూడు సినిమాలకు గాను ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్న షాలిని పాండే నిశబ్దం సినిమాకు డేట్లు ఇవ్వద్దంటూ వారు అగ్రిమెంట్‌ రూల్‌ ను బయటకు తీసుకు వచ్చారట. దాంతో ఆమెతో షూటింగ్‌ చాలా కష్టం అయ్యింది. ఆమె కోసం షూటింగ్‌ ను ముంబయికి షిప్ట్‌ చేయడం జరిగిందని యూనిట్‌ సభ్యులు అంతా అక్కడకు వెళ్లడంతో చాలా రిస్క్‌ అయ్యిందట.

సినిమాలో షాలిని కీలక పాత్ర అవ్వడంతో ఆమె సీన్స్‌ ను స్కిప్‌ చేయడానికి లేకుండా అయ్యింది. మరో వైపు ఆమె యశ్‌ రాజ్‌ వారికి అగ్రిమెంట్‌ ఇవ్వడంతో కష్టపడి ఆమెతో బ్యాలన్స్‌ షూట్‌ పూర్తి చేసినట్లగా నిశబ్దం మేకర్స్‌ పేర్కొన్నారు. అనుష్క షాలిని పాండేతో పాటు ఈ సినిమాలో అంజలి కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది. మాధవన్‌ హీరో గా నటించిన ఈ సినిమాకు హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అనుష్క మూగ చెవిటి అమ్మాయిగా కనిపించబోతుంది.