బ్రేకింగ్: తాగిన మత్తులో 3 వాహనాలను ఢీ కొట్టిన యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్

డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత ప్రమాదమో.. ఇలా ఎంత మంది ప్రాణాలు పోతున్నా.. అమాయకుల ప్రాణాలు పోతున్నా ఇంకా సమాజంలో మార్పు రావడం లేదు. కాస్త పాపులర్ అయిన సెలబ్రిటీల విషయంలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నయి. అటువంటి సంఘటనే హైదరాబాద్ లో జరిగింది. తెలుగు యూట్యూబ్ స్టార్ షణ్ముక్ జశ్వంత్ తప్పతాగి కారు నడిపి ఓ ప్రమాదానికి కారణమయ్యాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ సంఘటన.

షణ్ముఖ్ తాగి డ్రైవ్ చేస్తూ ఉడ్‌ల్యాండ్ అపార్ట్‌మెంట్స్ వద్ద మూడు వాహనాలను ఢికొట్టాడు. ఈ ఘటనలో ఓ ద్విచక్ర వహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆ వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు షణ్ముక్‌ జశ్వంత్‌కు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ఏకంగా 170 రీడింగ్ రావడం అతని పరిస్థితికి అద్దం పడుతోంది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. ఆ సమయంలో షణ్ముక్ ర్యాష్ డ్రైవింగ్ చేసి వాహనాలను ఢికొట్టాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.