శ్రియ అస్సలు తగ్గట్లేదుగా…

కొందరు హీరోయిన్లు సినిమాల్లో చాలా గ్లామరస్‌గా కనిపిస్తారు. బయట మాత్రం మామూలుగా ఉంటారు. ఇంకొందరు మాత్రం సినిమాల్లో ఎలా రెచ్చిపోతారో.. బయట కూడా అలాగే కాక పుట్టిస్తుంటారు. సీనియర్ హీరోయిన్ శ్రియ సరన్ రెండో కోవకే చెందుతుంది. కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ పాత్రలకు పెట్టింది పేరైన శ్రియ.. చాలా సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌ను హద్దులు దాటించేసింది.

ఆమెతో పాటు కెరీర్ ఆరంభించిన.. ఆ తర్వాత వచ్చిన స్టార్ హీరోయిన్లందరిలో ఎక్కువ అందాల ప్రదర్శన చేసింది శ్రియనే అంటే అతిశయోక్తి లేదు. సినిమాల్లోనే కాదు.. బయట కూడా శ్రియ అందాల విందుకు హద్దులేం పెట్టుకోదు.

ఈ మధ్య ఖమ్మంలో జరిగిన ‘పైసా వసూల్’ ఆడియో వేడుకకు శ్రియ ఎలాంటి డ్రెస్సుతో వచ్చిందో గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్ అవతల, బహిరంగ ప్రదేశంలో జరిగిన ఆడియో వేడుక అయినా ఆమె తగ్గలేదు. తాజాగా ‘పైసా వసూల్’ ఆడియో సక్సెస్ మీట్‌కు సైతం శ్రియ తనదైన శైలి డ్రెస్సింగ్‌తో వచ్చింది.

కైరా దత్ లాంటి ఐటెం భామ కూడా మామూలుగా వస్తే.. శ్రియ మాత్రం ఎద అందాలు ఎలివేట్ అయ్యే డ్రెస్‌తో వచ్చింది. ఈ విషయంలో ఆమె తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటన్నది కూడా ఫొటోలు చూస్తే అర్థమవుతుంది. 30 ప్లస్‌లోకి రాగానే చాలామంది హీరోయిన్లు కొంచెం పద్ధతిగా తయారవుతుంటారు. కానీ శ్రియ మాత్రం గ్లామర్ డోస్ ఇంకా పెంచేస్తుండటం చిత్రమే.