బాలు గారి కోరిక తీర్చలేక పోయానంటూ దేవిశ్రీ ప్రసాద్‌ ఆవేదన

కరోనా బారిన పడ్డ ఎస్పీ బాలసుబ్రమణ్యం దానికి జయించినా దాని వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలను మాత్రం జయించలేక మృత్యవుతో దాదాపు నెల రోజులు పోరాటం చేసి చివరకు తుది శ్వాస విడిచారు. ఈ సందర్బంగా ఆయనతో ఉన్న ఎంతో మంది తీవ్ర భావోద్వేగానికి గురి అయ్యారు. ఆయనతో తమ అనుభందంను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అయ్యారు. టీవీ ఇంటర్వ్యూలో సోషల్‌ మీడియాలో టాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల సినీ ప్రముఖులు స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ బాలు గారితో తనకు ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు.

ఆ సందర్బంగా దేవి మాట్లాడుతూ.. చాలా రోజులుగా బాలు గారికి ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ ను పాడాలని కోరిక. ఒకటి రెండు సార్లు స్వయంగా నాతో ఆయన అన్నారు. నాకు ఆ పాట పాడాలని ఉంది. హైదరాబాద్‌ లేదా చెన్నై ఎక్కడ వీలు అయితే అక్కడ ఆ పాటను నాతో రికార్డ్‌ చేయమని అన్నారు. ఆ పాట అనుకుంటున్న సమయంలోనే కరోనా వచ్చింది. లాక్‌ డౌన్‌ కారణంగా పాట రికార్డ్‌ చేయలేక పోయాం. లాక్‌ డౌన్‌ తర్వాత మొదటగా నాన్నకు ప్రేమతో పాటను రికార్డ్‌ చేయాలని బాలు గారు అనుకున్నారు.

నేను కూడా అందుకు రెడీగా ఉన్నాను. బాలు గారు పలు సందర్బాల్లో ఆ పాట గురించి అభినందించారు. ఆ పాట చాలా బాగా నచ్చిందని నాకు ఆ పాట పాడాలని కోరికగా ఉందని అన్నారు. అందుకే ఆయనతో రికార్డ్‌ చేయాలని అనుకున్నాం. కాని ఆయన అంతగా కోరుకున్న నాన్నకు ప్రేమతో పాటను పాడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయారు. ఆయన కోరిక తీర్చలేక పోయానే అనే అసంతృప్తి నాకు ఎప్పటికి ఉంటుందని దేవిశ్రీ ప్రసాద్‌ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.