శ్రీముఖి ‘క్రేజీ అంకుల్‌’ పాత్రలో సింగర్‌ మనో

తెలుగులో ఓటీటీ కంటెంట్‌ కు ప్రాముఖ్యత పెరుగుతోంది. ప్రముఖ ఓటీటీలు సినిమాల రేంజ్లో వెబ్‌ సిరీస్‌లను మరియు వెబ్‌ మూవీస్ ను నిర్మిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ శ్రేయాస్‌ ఈటీ వారు క్రేజీ అంకుల్స్‌ అనే వెబ్‌ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యింది.

ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వరరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో విశేషం ఏంటీ అంటే శ్రీముఖి కి సింగర్‌ మనో, సంగీత దర్శకుడు రఘు కుంచె మరియు రాజా రవీందర్‌ అంకుల్స్‌ గా నటించబోతున్నారు.

రెగ్యులర్‌ కు చాలా విభిన్నంగా ఉండే ఈ క్రేజీ అంకుల్స్‌ డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ లో తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందంటున్నారు. క్రేజీ అంకుల్స్‌ మూవీని శ్రేయాస్‌ ఈటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. పే పర్‌ వ్యూ పద్దతిన ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

రామ్‌ గోపాల్‌ వర్మ నుండి వచ్చిన సినిమాలు వరుసగా శ్రేయాస్‌ ఈటీలో విడుదల అయ్యి మంచి లాభాలు తెచ్చి పెట్టాయి. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా మంచి లాభాలు దక్కించుకుంటుందని అంటున్నారు. దసరా రోజు ఈ సినిమా షూటింగ్‌ ను లాంచనంగా ప్రారంభించబోతున్నారు.

Share