ప్రభాస్ బాడీ గురించి ఘాటు కామెంట్లు చేసిన శ్రీరెడ్డి

వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఘాటు కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది శ్రీరెడ్డి. ఇటీవలే విశాల్ గురించి నెగటివ్ గా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. విశాల్ డౌన్ ఫాల్ మొదలైంది అంటూ శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది.

అయితే ఇప్పుడు ఈ అమ్మడు రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి కామెంట్స్ చేసింది. అయితే ఇందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ గురించి పాజిటివ్ గానే మాట్లాడింది. రీసెంట్ గా ప్రభాస్ సలార్ పోస్టర్ విడుదలైన సంగతి తెల్సిందే.

ఫుల్ మాస్ గెటప్ లో ఉన్న పోస్టర్ ను విడుదల చేసారు. దాంతో పాటు సలార్ విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 14, 2022న సలార్ విడుదల కానుంది. అయితే ప్రభాస్ బాడీ గురించి, “వామ్మో, సలార్ లో ఆ బాడీ ఏంట్రా బాబు, పోస్టర్ లోనే ఇలా ఉంటే ఇక సినిమాలో ఎలా ఉంటుందో” అని శ్రీరెడ్డి అంటోంది.