చూడ్డానికి రెండు కళ్లు చాలవు.. ఉప్పెన రొమాంటిక్‌ సాంగ్‌ ను దించేసిన సుధీర్‌ రష్మి

ఉప్పెన సినిమాలోని జలజలజలపాతం నువ్వు పాట ఏ రేంజ్‌ లో సక్సెస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీడియో సాంగ్‌ బయటకు వచ్చిన తర్వాత చాలా మంది కవర్‌ పాటలు చేశారు. తాజాగా సుధీర్ మరియు రష్మీలు ఆ పాటకు స్టేజ్‌ షో చేశారు. అద్బుతంగా వచ్చిన ఆ పాట ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కరికి హీట్‌ పెంచుతోంది. హీరో హీరోయిన్‌ కంటే కూడా సుధీర్‌ మరియు రష్మీలు చేసిన పాటకు ఖచ్చితంగా అధిక క్రేజ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

ఇప్పటికే ప్రోమో ట్రెండ్‌ అవుతోంది. అద్బుతమైన ఈ పాట కు వారిద్దరి రొమాన్స్ మరింతగా ఆకర్షణను అద్దింది. దాంతో ఈ ప్రోమోనే చూడ్డానికి రెండు కళ్లు చాలడం లేదు అంటూ ప్రేక్షకులు అంటున్నారు. పాటతో సుధీర్ మరియు రష్మిల జంట మరోసారి ట్రెండ్డింగ్‌ లో నిలవడం ఖాయం అంటున్నారు. అద్బుతమైన ఈ పాటను చూడ్డం కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఎదురు చూపులకు తగ్గ ఫలితం ఉంటుందని అంటున్నారు. ఒక్క దుప్పటిలో సుదీర్‌ మరియు రష్మి కలవడం ఇంకా మరింత రొమాంటిక్ గా పాటను తీసినట్లుగా ప్రోమోలో అర్థం అవుతుంది.