లూసిఫెర్ రీమేక్ నుండి సుజీత్ ను తప్పించడానికి కారణాలు ఏంటి?

మెగాస్టార్ చిరంజీవి ఎంతో మనసుపడ్డ సినిమా మలయాళంలో విడుదలైన లూసిఫెర్. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ మలయాళంలో పెద్ద సక్సెస్. ఈ సినిమా తెగ నచ్చేయడంతో రామ్ చరణ్ ఈ సినిమా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా సుజీత్ ను ఎంచుకున్నారు. సాహోతో ప్లాప్ అందుకున్నా కానీ సుజీత్ స్టైలిష్ టేకింగ్ పై నమ్మకముంచిన రామ్ చరణ్, చిరంజీవి అతణ్ణి రీమేక్ దర్శకత్వ బాధ్యతలను అప్పగించారు. రెండు, మూడు నెలల పాటు సుజీత్ లూసిఫెర్ రీమేక్ పై వర్క్ చేసాడు. చిరంజీవికి తగ్గట్లుగా స్క్రిప్ట్ కు మార్పులు చేర్పులు చేసాడు.

కట్ చేస్తే ఇప్పుడు సుజీత్ స్థానంలో వినాయక్ ఈ రీమేక్ ను డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ సుజీత్ ను సడెన్ గా ఈ మూవీ నుండి ఎందుకు తప్పించినట్లు? దీనికి చిరంజీవి స్వయంగా సమాధానం చెప్పాడు.

రెండు నెలల తర్వాత సుజీత్, చిరంజీవిని కలిసి తన పెళ్లి ఉన్న కారణంగా రీమేక్ పై సరిగ్గా వర్క్ చేయలేకపోతున్నానని, తనను క్షమించమనికోరినట్లు చిరంజీవి చెప్పాడు. దాంతో సుజీత్ నుండి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు వినాయక్ వద్దకు వెళ్లాయట. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.