సుకుమార్ చూపు కూడా ఓటిటి వైపే!

నెమ్మదిగా టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ డిజిటల్ స్పేస్ వైపు అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. సినిమాలు విడుదల కావట్లేదు. సినిమా షూటింగులు కూడా జరగట్లేదు. మరో రెండు నెలలు ఇదే పరిస్థితి ఉండే అవకాశముంది. సో, ఫిలిం మేకర్స్ ను డిజిటల్ స్పేస్ ఆకర్షిస్తోంది. టాప్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వారు డైరెక్ట్ గా దర్శకత్వంలోకి దిగకుండా నిర్మాణంలో భాగం పంచుకుంటూ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి, తమ అసిస్టెంట్ లకు లేదా మిగతా వారికి ఈ వెబ్ సిరీస్ లు డైరెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు సుకుమార్ కూడా వెబ్ సిరీస్ ను తెరకెక్కిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ను 9 ఎపిసోడ్స్ గా మలచనున్నట్లు సమాచారం. ఈ 9 ఎపిసోడ్స్ లో కూడా 9 వివిధ ప్రేమ కథలను చూపించనున్నాడు. 9 మంది దర్శకులను ఈ వెబ్ సిరీస్ కోసం తీసుకోనున్నాడు. అలాగే 9 మంది నటులు లీడ్ రోల్స్ లో కనిపిస్తాడు. ఈ భిన్నమైన వెబ్ సిరీస్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం ఓ కొలిక్కి వస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే రంగస్థలంతో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్, అల్లు అర్జున్ తో పుష్ప చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ పరిస్థితులు చక్కబడ్డాక మొదలవుతుంది.