చరణ్‌ లుక్కుకి సుక్కూ టిక్కు

సుకుమార్‌ సినిమాలో చరణ్‌ సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఇండస్ట్రీ టాక్‌ని బట్టి ఇందులో చరణ్‌ వినికిడి లోపమున్న కుర్రాడిగా నటించనున్నాడు. తొంభైవ దశకంలోని కుర్రాళ్ల లుక్‌ మ్యాచ్‌ అయ్యేటట్టుగా గడ్డం పెంచాల్సిందిగా సుకుమార్‌ ఆదేశించడంతో చరణ్‌ కొంత కాలంగా గడ్డం పెంచుతున్నాడు. అలాగే హెయిర్‌ స్టయిల్‌ కూడా అప్పటి ట్రెండుకి తగ్గట్టుగా మార్చాడు. ప్రతి పదిహేను రోజులకోసారి చరణ్‌ లుక్‌ కరక్ట్‌గా వుందా లేదా అనేది చెక్‌ చేసుకుంటూ వచ్చిన సుకుమార్‌ ఫైనల్‌గా ఈ లుక్‌ని ఓకే చేశాడట.

ఇక ఇంతకుమించి గడ్డం, జుట్టు పెంచవద్దని చెప్పడంతో చరణ్‌ తన స్టయిలిష్ట్‌ని అలర్ట్‌ చేసాడు. వచ్చే నెలలోనే సెట్స్‌ మీదకి వెళుతోన్న ఈ చిత్రం కోసం హీరోయినే ఇంకా ఖరారు కాలేదు. పల్లెటూరి యువతి పాత్రకి అనుపమ సెట్‌ అవుతుందని మొదట ఆమెనే ఖరారు చేశారు కానీ తర్వాత వద్దనుకున్నారు. అసలే కథాపరంగా ప్రయోగానికి వెళుతున్నారు కనుక స్టార్‌ కాస్ట్‌ పరంగా ఎక్కువ రిస్క్‌ చేయరాదని ఒక స్టార్‌ హీరోయిన్‌ కోసం చూస్తున్నట్టు సమాచారం.