బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన సింగర్ సునీత

సింగర్ సునీత గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ పాటలు తన మధురమైన గొంతుతో సునాయాసంగా ఆలపించింది సునీత. ఆమె కెరీర్ పరంగా ఎంత పాపులారిటీ సంపాదించిందో అంతే పాపులారిటీ ఆమెకు కాంట్రవర్సీ ద్వారా లభించింది. అందులోనూ ఆమె వ్యక్తిగత జీవితం మీద ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.

నిత్యం ఏదో రకంగా వార్తల్లో ఉండే సునీత గురించి తాజాగా వచ్చిన రూమర్లు బిగ్ బాస్ గురించి. సునీత ఈసారి బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తోందని వార్తలు వచ్చాయి. ఇందుకోసం ఆమె భారీ రెమ్యునరేషన్ ను తీసుకుంటోందని కూడా అన్నారు. అయితే ఈ విషయంపై సునీత క్లారిటీ ఇచ్చింది. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ లో బిగ్ బాస్ పై క్లారిటీ ఇస్తూ “నేను బిగ్ బాస్ 4 కు వెళుతున్నాను అన్న వార్తల్లో నిజం లేదు. నాకు వెళ్లే ఉద్దేశం కూడా లేదు.” అని పోస్ట్ చేసింది.

బిగ్ బాస్ విషయంలో కొంత మంది సెలబ్రిటీలు ఆసక్తి ప్రదర్శిస్తుండగా మరోకొంత మంది అస్సలు వద్దు అనుకుంటున్నారు. అలాంటి వారిలో తరుణ్, శ్రద్ధ దాస్, సునీత లాంటి వారు కొందరు. వారి వ్యక్తిగత జీవితాన్ని, కాంట్రవర్సీలను ఎత్తి చూపే అవకాశం ఉన్నందువల్ల వారు వద్దనుకుంటున్నట్లు తెలుస్తోంది.