సూర్య సినిమా విషయంలో మరోసారి నిరాశే ఎదురైందిగా!

హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సూర్య వరసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. సూర్య సినిమా విజయం సాధించి చాలా కాలమే అయింది. రీసెంట్ గా కథలను ఎన్నుకోవడంలో చేసిన తప్పుల కారణంగా సినిమాల ఫలితాలు తారుమారయ్యాయి. సూర్య నటించిన లేటెస్ట్ సినిమా ఆకాశం నీ హద్దురా సమ్మర్ లోనే విడుదల కావాల్సింది. అయితే కరోనా వైరస్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. మొత్తానికి అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాను కొనుగోలు చేసింది.

అక్టోబర్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అమెజాన్ ప్రైమ్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తవుతుండగా సూర్య అభిమానులకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం నుండి ఇంకా రావాల్సిన అనుమతులు రాని కారణంతో ఆకాశం నీ హద్దురా చిత్ర విడుదలను వాయిదా వేసింది ప్రైమ్.

తాజాగా దీపావళి కానుకగా నవంబర్ 13న ఆకాశం నీ హద్దురాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. సుధా కొంగర ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా ఆకాశం నీ హద్దురా సినిమా తెరకెక్కింది. సూర్య పైలట్ పాత్రలో నటిస్తుండగా అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తోంది. మోహన్ బాబు ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.

వరస ప్లాపుల నుండి సూర్య ఈ సినిమాతో అయినా బయటపడతాడేమో చూడాలి.