తెలుగు సినిమాల్లో కెరీర్ క్లోజన్నమాట

‘బాహుబలి’ సినిమా కోసం నటీనటులందరూ చాలా కష్టపడ్డారు. ఐతే చాలామంది ఆ కష్టానికి తగ్గ ఫలితం అందుకున్నారు. అందరికీ మంచి పేరొచ్చింది. లాభపడ్డారు. కానీ తమన్నాకు ఈ సినిమా వల్ల ఏమాత్రం ప్రయోజనం చేకూరింది అంటే సమాధానం చెప్పడం కష్టమే.

‘ది బిగినింగ్’ వల్ల తమన్నాకు దేశవ్యాప్తంగా గుర్తింపు పెరిగిన మాట వాస్తవం. కానీ అవకాశాలు మాత్రం అనుకున్న స్థాయిలో లేవు. ముఖ్యంగా ‘బాహుబలి’ బేసిగ్గా తెరకెక్కిన భాషలో ఆమెకు అవకాశాలే లేకపోవడమే ఆశ్చర్యం. ‘బాహుబలి’ తర్వాత తమన్నా చేసిన స్ట్రెయిట్ మూవీ ‘బెంగాల్ టైగర్’ మాత్రమే. అది కూడా ముందే కమిటైన సినిమా.

‘బాహుబలి’ తర్వాత ఒక్క తమిళంలో మాత్రమే తమన్నాకు అవకాశాలు పెరిగాయి. తెలుగులో ఛాన్సులు నిల్. గత ఏడాది తమ్మూ తెలుగు ప్రేక్షకుల్ని ఒక్క ‘అభినేత్రి’ సినిమాతో మాత్రమే పలకరించింది. అది ఫ్లాప్ అయింది. అది బేసిగ్గా తెలుగు సినిమా కాదు. ప్రస్తుతం తమిళంలో ‘పెళ్లిచూపులు’ రీమేక్‌తో పాటు బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లి దర్శకత్వంలో ద్విభాషా చిత్రం చేస్తోంది తమ్మూ. ఆ సినిమాలో సందీప్ కిషన్ హీరో.

అతడికీ తెలుగు సినిమాల్లో అతడి పరిస్థితి కూడా ఏమంత బాగా లేదు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమాకు కూడా తమిళంలో  క్రేజ్ రావొచ్చేమో కానీ తెలుగులో సందేహమే. ‘బాహుబలి: ది కంక్లూజన్’లో తమన్నా ఒక్క నిమిషం కూడా కనిపించకపోవడం ఆమె కెరీర్ మీద కొంచెం ప్రతికూల ప్రభావమే చూపింది. ఆమెను రాజమౌళి ఇగ్నోర్ చేసినట్లే మిగతా ఫిలిం మేకర్స్ కూడా ఇగ్నోర్ చేస్తున్నారు. ఇంతకుముందులాగా స్టార్ హీరోలు తమన్నాను కన్సిడర్ చేయట్లేదు. మొత్తానికి పరిస్థితి చూస్తుంటే తెలుగు సినిమాల్లో తమన్నా కెరీర్ క్లోజ్ అయినట్లే కనిపిస్తోంది.