తమన్నాకు ఊహించని షాక్ ఇచ్చిన మాస్టర్ చెఫ్ నిర్వాహకులు

మిల్కీ బ్యూటీ తమన్నా, మాస్టర్ చెఫ్ నిర్వాహకులకు మధ్య మొదలైన గొడవ నెమ్మదిగా ముదురుతోంది. పలు దేశాల్లో ఫేమస్ అయిన మాస్టర్ చెఫ్ సౌత్ ఇండియాలో అన్ని భాషల్లో మొదలైన విషయం తెల్సిందే. తెలుగులో తమన్నా కార్యక్రమానికి హోస్ట్ గా ఎంపికైంది. అయితే కొన్ని ఎపిసోడ్ల తర్వాత తమన్నా స్థానంలో అనసూయ వచ్చింది. డేట్స్ సమస్య కారణంగా తప్పుకుందని అనుకున్నారు కానీ తమన్నా మాస్టర్ చెఫ్ నిర్వాహకులపై ఆరోపణలు చేసింది.

తనకు రెమ్యునరేషన్ చెల్లించకుండా కమ్యూనికేషన్ ను కూడా కట్ చేసారని తమన్నా ఆరోపించింది. ఇప్పుడు మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దీనిపై స్పందించారు. తమన్నాకు మొత్తం 18 ఎపిసోడ్ల చిత్రీకరణకు గాను 2 కోట్ల రూపాయలను పారితోషికంగా చెల్లించాలని డీల్ చేసుకున్నామని తెలిపారు.

అయితే ఆమె 16 ఎపిసోడ్ల చిత్రీకరణకు మాత్రమే వచ్చిందని, ఆమె రాని రెండు ఎపిసోడ్స్ కు గాను దాదాపు 300 మంది వర్క్ చేస్తోన్న ప్రొడక్షన్ హౌజ్ కు 5 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని తెలిపారు. అందుకే ముందు చేసుకున్న డీల్ లో 2 కోట్ల రూపాయలలో 1.5 కోట్లను చెల్లించామని రూమర్స్ ను క్లియర్ చేసారు.