త‌లకిందులైన త‌మ‌న్నా

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న‌కంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ త‌మ‌న్నా. ఏం చేసినా త‌న‌దంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉండాల‌ని ఆమె ఎప్పుడూ శ్ర‌మిస్తుంటారు. అంద‌రిలో ఒక‌రిలా కాకుండా, కొంద‌రిలో తానొక‌రిగా ఉండేందుకు త‌మ‌న్నా ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌కొత్త ప్ర‌యోగాలు చేస్తూ ఉంటారు.

ఆ మ‌న‌స్త‌త్వం, ఆకాంక్షే తాజాగా త‌మ‌న్నాను మ‌రోసారి వార్త‌ల్లో ఎక్కించింది. ఆ అందాల భామ త్రో బ్యాక్ వీడియోని షేర్ చేసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ట్రైన‌ర్ స‌మ‌క్షంలో త‌మ‌న్నా ఈ ఫీట్ చేసి అబ్బుర‌ప‌రిచారు. త‌మ‌న్నా త‌న ఫీట్‌కు సంబంధించి ఓ వీడియో రికార్డు చేశారు.

దాన్ని త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌మ‌న్నా స్పందిస్తూ…‘ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్’ మీకు అందిస్తున్నాను. మోచేతులు, త‌ల‌ని బ్యాలెన్స్ చేస్తూ హెడ్‌ని ఖచ్చితంగా స్టాండ్ చేసే ప్ర‌య‌త్నాల‌లో ఇది ఒక‌టి’ అని వివ‌రించారామె. అంతేకాదు, సొంతంగా ప్ర‌యోగాలు చేయ‌వ‌ద్ద‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రించారు.

ట్రైన‌ర్ స‌మ‌క్షంలోనే ఇలాంటి ఫీట్స్ చేయాల‌ని ఆ గ్లామ‌ర్ హీరోయిన్‌ నెటిజ‌న్స్‌కి సూచించారు. కానీ ఒక్క విష‌యంలో త‌మ‌న్నాని క‌చ్చితంగా మెచ్చుకోవాల్సిందే. అదేంటంటే త‌ల‌పై బాడీని మొత్తం బ్యాలెన్స్ చేస్తూ త‌మ‌న్నా చేసిన వ‌ర్క‌వుట్‌ని ‘కెవ్వు కేక’ అనాల్సిందే. ఒక‌సారి ఆమె వీడియోని చూడండి…మీకే అర్థ‌మ‌వుతుంది.