బాలకృష్ణ అలా అనడం కరెక్ట్ కాదు – తమ్మారెడ్డి భరద్వాజ్

లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా సినీ ప్రముఖులంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్స్ విషయంలో చర్చలు జరుపుతున్న విష్యం తెలిసిందే. జనవరి 28న బాలకృష్ణ ‘నన్నెవరూ ఏ మీటింగ్ కి పిలవలేదంటూ’ ఘాటుగా స్పందించారో అక్కడి నుంచి ఇండస్ట్రీలో పలు రకాల విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటికే బాలయ్య అన్న కామెంట్స్ పై నాగబాబు ఘాటుగా స్పందించి ‘ తెలుగు సినీ పరిశ్రమకి, తెలంగాణ ప్రభుత్వానికి’ క్షమాపణ చెప్పాలని కోరారు.

ఈ విషయంపై కొందరు బాలకృష్ణకి సపోర్ట్ గా ఉంటే, కొందరు చిరు అండ్ ప్రముఖులు చేసిన విషయానికి సపోర్ట్ చేస్తున్నారు. తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ బాలకృష్ణపై మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘తెలంగాణ ప్రభుత్వం నుంచే చిరుగారిని ఎన్నుకోవడం వలన ఆయన లీడ్ తీసుకొని ఇండస్ట్రీ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పూనుకున్నారు. చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు. అందరినీ పిలవాల్సిన అవసరం లేదు. వారందరూ సెలబ్రిటీస్, ఈ టైంలో ఎక్కువ మంది ఎందుకు, అయినా వారిని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అందరినీ పిలిచి ఉండరు. గత ప్రభుత్వం బాలకృష్ణ వాళ్లదే.. మమ్మల్ని ఎప్పుడైనా పిలిచాడా బాలయ్య? చంద్రబాబు హయాంలో నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ ఇలా ఎవరూ వెళ్ళలేదు. వాళ్ళకి కావాల్సిన వారిని పిలిపించి మాట్లాడారు. మాకు నమ్మకం మా సమస్యని బాలయ్య చూసుకుంటారులే అని.. అప్పుడెవరూ అడగలేదుగా.. మీ మీడియా వాళ్ళు ఎదో అడగ్గానే ఆయన ఎదో అనేసారు. ఇండస్ట్రీకి మంచి జరుగుతుంటే బాలకృష్ణ గారికేమన్నా నొప్పా.. ఉండదుగా.. అన్నీ క్లియర్ అయితే ఆయన సినిమాలు జరుగుతాయి, హ్యాపీ కదా.. చిరు, నాగ్, కొందరు నిర్మాతలు కలిసి వెళ్లారు.. పర్మిషన్ ఇస్తే వాళ్ళ సినిమా షూటింగ్స్ మాత్రమే చేస్తారా, లేదుగా అందరికీ పర్మిషన్ వస్తుంది కదా.. అలాంటప్పుడు నన్ను పిలవలేదని బాలకృష్ణ అనడం కరెక్ట్ కాదు, అసలు మీడియా వారు ఆ ప్రశ్న అడగడం కూడా కరెక్ట్ కాదు. బాలకృష్ణ గారు ఎదో మూడ్ లో ఉండి మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడింది మనం సీరియస్ గా తీసుకోకూడదు. ఆయన్ని పట్టించుకోకూడదు. బాలకృష్ణ – నాగబాబులది వారి పరసనల్ సమస్య.. దానికి దీనికి సంబంధం లేదు. మా ఇండస్ట్రీకి లాభం చేకూరడం కోసం బాలకృష్ణ గారితో పనవుతుందంటే వారి దగ్గరికే వెళ్తాం. అలా ఎప్పుడు ఎవరు అవసరం అయితేనే వారినే కలుస్తాం. అంత సింపుల్, ఇక్కడ వర్గాలు, రాజకీయాలు ఏం లేవు. ఇండస్ట్రీ మంచి కోసం ఎప్పుడూ ఇలాంటి బేధాలు పెట్టుకోకుండా ఉండాలి. ఇంకా ముందుముందు ఇండస్ట్రీకి చాలా బాడ్ ఫేస్ ఉండనుంది. ఇలాంటి టైములో ఇలాంటి కప్పగంతులు వేయకుండా ఉంటే అందరికీ మంచిదని’ తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నారు.

ఈ విషయంలో ఇలా రోజుకో సెలబ్రిటీ, రోజుకోలా రియాక్ట్ అవుతున్నారు. మరి ఈ టాపిక్ ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి.