తరుణ్ భాస్కర్ కు మంచి ఆఫర్

తరుణ్ భాస్కర్ మంచి దర్శకుడే కాదు వెర్సటైల్ రైటర్ కూడా. యూత్ ఫుల్ కంటెంట్ కు కాంటెంపరరీ స్టఫ్ ను అద్దగలడు. ఇప్పుడు అతనికి చిన్న స్పెషలాఫర్ వచ్చింది. ఓ మై కడవులే రీమేక్ కు డైలాగ్ వెర్షన్ రాయడం. విష్వక్ సేన్ హీరోగా తయారయ్యే ఈ సినిమాకు తమిళ మాతృక ను అందించన దర్శకుడే పని చేస్తారు.

జీ 5 లో ఇప్పటికే పాపులర్ వ్యూవర్ షిప్ అందుకున్న ఓ మై కడవులే సినిమాకు తెలుగు డైలాగ్ వెర్షన్ అందించమని తరుణ్ భాస్కర్ ను నిర్మాత పివిపి కోరినట్లు బోగట్టా. దానికి ఆయన కూడా ఓకె అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు గాను యాభై లక్షల రెమ్యూనిరేషన్ అందుతుందని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

దర్శకుడిగా ఆయన పేరు, దాని వాల్యూ లెక్కల్లో చూసుకుంటే, తక్కువా? అన్న అనుమానం కలుగుతుంది కానీ, ఓ రైటర్ గా డైలాగ్ వెర్షన్ కు యాభై లక్షలు అంటే మంచి మొత్తమే అన్నది ఇండస్ట్రీ టాక్. ఓ మై కడవులే లాంటి టిపికల్ సబ్జెక్ట్ కు డైలాగ్ వెర్షన్ అంటే కాస్త గట్టి కసరత్తే చేయాల్సి వుంది. తరుణ్ భాస్కర్ ఈ విషయంలో సక్సెస్ అవుతారనే నమ్మకం ఇండస్ట్రీలో వుంది.