మెగాస్టార్ తో అప్పుడు వద్దంది… ఇప్పుడు సై అంది!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య చిత్రంలో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే దర్శకుడితో అభిప్రాయ బేధాల కారణంగా త్రిష ఈ సినిమా నుండి తప్పుకుంది. ఆమె స్థానంలో కాజల్ అగర్వాల్ ను తీసుకున్నారు.

ఇదిలా ఉంటే అప్పుడు నో చెప్పిన త్రిష, ఇప్పుడు చిరంజీవి సినిమాలో నటించేందుకు ఎస్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఆచార్య తర్వాత లూసిఫెర్ రీమేక్ లో నటించబోతున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి చెల్లి పాత్ర చాలా కీలకం. ఈ పాత్రకు ముందుగా విజయశాంతిని అడగ్గా చిరుకు చెల్లి పాత్రలో తాను సరిపోనని ఆఫర్ ను కాదనుకుంది.

తర్వాత నయనతారను సంప్రదించినా అదే రెస్పాన్స్ వచ్చింది. చివరికి త్రిషను అడిగారు. ఆమె వెంటనే ఎస్ చెప్పింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.