తన తల్లి పుట్టినరోజుకు మరుపురాని గిఫ్ట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ తన కష్టం మీద హీరోగా ఎదిగి ఈరోజు స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. అటు సినిమాలతో పాటు బిజినెస్ మీద కూడా దృష్టి పెట్టాడు విజయ్. ఇప్పటికే రౌడీ వేర్ పేరుతో బ్రాండ్ క్రియేట్ చేసి యూత్ ను ఆకర్షిస్తున్నాడు.

ఇప్పుడు థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టాడు విజయ్. ఏవిడి సినిమాస్ పేరుతో తన తల్లిదండ్రుల సొంత ప్రాంతమైన మహబూబ్ నగర్ లో మల్టీప్లెక్స్ ను ప్రారంభించాడు విజయ్. ఈరోజు లవ్ స్టోరీ విడుదలతో ఏవిడి సినిమాస్ ప్రారంభమైంది. వరల్డ్ క్లాస్ ఫినిష్ తో అత్యాధునిక టెక్నాలజీతో ఈ మల్టీప్లెక్స్ నిర్మించాడు.

ఈరోజు విజయ్ దేవరకొండ తల్లి పుట్టినరోజు కూడా కావడం విశేషం. ఈ సందర్భంగా విజయ్ ట్వీట్ చేసాడు. “హ్యాపీ బర్త్ డే ముమ్ములు, ఇది నీకోసమే. నువ్వు వర్కౌట్ చేసి ఆరోగ్యంగా ఉంటే, నేను ఇంకా కష్టపడి నీకు మంచి జ్ఞాపకాలను అందిస్తాను” అని విజయ్ అన్నాడు.