మరో పవర్ ఫుల్ రోల్ లో రాములమ్మ

లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు దక్కించుకుని ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన రాములమ్మ విజయశాంతి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. సుదీర్ఘ కాలం విరామం తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మళ్ళీ తాను నటించక పోవచ్చు అంటూ విజయశాంతి పేర్కొంది. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మరో సినిమాను ఈమె చేయబోతుందట.

టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రతిమా ఫిల్మ్ బ్యానర్ లో ఒక సినిమాను చేయబోతోంది. పవర్ ఫుల్ కథ ను రెడీ చేశారని ఆ కథకు రాములమ్మ సరిగా సూట్ అవుతుంది అని వారు భావిస్తున్నారు. రాములమ్మ కూడా ఈ సినిమా లో నటించేందుకు దాదాపుగా ఒకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది.