‘సాహో’కు సూటవుతుందా అసలు?

ప్రభాస్ కొత్త సినిమా ‘సాహో’లో హీరోయిన్ అంటూ చాలా పేర్లు వినిపిస్తున్నాయి కొన్ని నెలలుగా. కానీ వాళ్లెవ్వరినీ కాదని.. చివరికి ప్రభాస్ లక్కీ హీరోయిన్ అనుష్కనే ఈ సినిమాకు కథానాయికగా ఫైనలైజ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి మిక్స్డ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. బిల్లా, మిర్చి, బాహుబలి లాంటి సినిమాలతో ప్రభాస్-అనుష్కలది హిట్ కాంబినేషన్ అనిపించుకున్న మాట వాస్తవమే. ఐతే ‘సాహో’ సినిమాకు అనుష్క ఏమాత్రం సూటవుతుందో అన్నదే డౌటు. ఎందుకంటే అనుష్కలో ఇంతకుముందున్న సెక్సీ లుక్ లేదు. ఆమె ‘బిల్లా’ టైంలో ఉన్నట్లుగా ఉంటే ‘సాహో’కు ఆమే కరెక్ట్ ఛాయిస్ అయ్యేదేమో.

‘సైజ్ జీరో’ కోసం తన ఫిజిక్‌ను చేజేతులా దెబ్బ తీసుకుంది అనుష్క. ఆ ప్రభావం ‘బాహుబలి’ మీదా పడింది. అనుష్క లుక్ దెబ్బ తింది. ఆమెలో ఇంతకుముందున్న నాజూకు తనం లేదు. వయసు ప్రభావం కూడా అనుష్క మీద స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘సాహో’ లాంటి స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్‌కు అనుష్క ఏమాత్రం సూటవుతుందో అన్న సందేహాలు నెలకొంటున్నాయి. ‘సాహో’ కోసం ప్రభాస్ తన లుక్‌ను ఎలా మార్చుకున్నాడో తెలిసిందే. టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతోందన్న విషయం స్పష్టంగా తెలిసిపోయింది. మరి అల్ట్రా మోడర్న్ లుక్‌లో కనిపించబోతున్న ప్రభాస్ పక్కన.. ఇప్పుడున్న లుక్‌తో అనుష్క ఏమాత్రం సూటవుతుందో చూడాలి. మరి ఈ సినిమా కోసం అనుష్క లుక్ పరంగా ఏదైనా మేకోవర్ కోసం ట్రై చేస్తుందేమో చూడాలి.